schedule Friday, September 11, 2026

తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్

calendar_today October 15, 2024
person dharshininews
తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్
తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్ - ధర్మకర్తల మండలికి దరఖాస్తుల ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పలు దేవాయాలకు నోటీఫికేషన్ జారీ అయ్యింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ఈఓ నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదారాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలతో తాండూరు పట్టణంలోని సద్గురు పోటీ మహరాజ్ దేవాలయం, నగరేశ్వర దేవాలయం, శ్రీ బాలాజీ మందిర్ తో పాటు యాలాల మండలం రసూల్ పూర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయాలకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. ఆయా దేవాలయాలకు ధర్మకర్తల మండలి నియామకం కోసం దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. ఈ నోటిఫికేషన్ వెలువడిన 20 రోజులలో రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29776/