schedule Tuesday, July 07, 2026

ఎద్దుపై పంజా..!

calendar_today October 16, 2024
person dharshininews
ఎద్దుపై పంజా..!
ఎద్దుపై పంజా..! - విచిత్ర గాయంతో మృతి - చిరుతపులి దాడి అంటూ అనుమానం - పొలంలో పులి అడుగుల కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : పొలం వద్ద కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఎద్దుపై చోటు చేసుకున్న గాయం చిరుత పులి జంతువుది అయి ఉంటుందని, పొలంలో కూడా పులి అడుగులు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తాండాకు చెందిన మూడవత్ గోప్యా నాయక్ తన ఎద్దులు, ఆవులను ఊరిబయట ఉన్న పొలం వద్ద రోజు మాదిరిగానే కట్టేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం వచ్చి చూసే సరికి ఓ ఎద్దు గాయాలతో మృతి చెందింది. గాయంపై క్రూర జంతువు దాడి చేసినట్లు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడూ పొలంలో పులి, లేదా హైనా జంతువు అడుగులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎద్దు మృతిపై కుటుంబ సభ్యులు రోధించారు. తమను ఆదుకోవాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29774/