schedule Saturday, September 05, 2026

డ్రోన్లసాగు లాభదాయకం..!

calendar_today October 18, 2024
person dharshininews
డ్రోన్లసాగు లాభదాయకం..!
డ్రోన్లసాగు లాభదాయకం..! - ఎర్ర కందుల పంటపై అవగాహన - కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధునిక వ్యవసాయంలో భాగంగా డ్రోన్లతో పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. శుక్రవారం తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంది పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కంది పంటలో కీటకాలు, వ్యాధి నియంత్రణ గురించి చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్త డా. సుధారాణి, డా. పరిమళ, లక్ష్మణ్, యమున తదితరుల కంది పంట సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయంలో డ్రోన్లసాగు పద్ధతులను, వినియోగాన్ని ప్రదర్శనలతో వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. శేఖర్, తాండూరు వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు డా.సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ప్రసాద్, పి. శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవడి... https://www.dharshininews.com/29837/