schedule Tuesday, July 07, 2026

పసుపెక్కిన కేవీసీఎస్..!

calendar_today October 26, 2024
person dharshininews
పసుపెక్కిన కేవీసీఎస్..!
పసుపెక్కిన కేవీసీఎస్..! - ఉత్సహాంగా ఎల్లో కలర్ డే - ఆకట్టుకున్న విద్యార్థినిల వేషాధారణలు - రంజింప చేసిన నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ హై స్కూల్ పసుపు మయంగా మారింది. శనివారం పాఠశాలలో ఎల్లో కలర్ డే వేడుకలు ఉత్సహంగా జరుపుకున్నారు. ఎల్లో కలర్ డే సందర్భంగా స్కూల్ కు చెందిన నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పసుపు అనగానే గుర్తుకువచ్చే నిమ్మకాయ, మామిడిపండు, మొక్కజోన్న బుట్ట, అరటి పండు తదితర వేధాషాధరణలో ప్రదర్శనలు ఇచ్చారు. పసుపు ఆనందానికి, స్నేహానికి ప్రతికగా నిలుస్తుందని, సృజనాత్మకతను ప్రేపేరిస్తుందని ప్రదర్శనలతో వివరించి రంజింపజేశారు. అదేవిధంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించారు. స్కూల్ వాతావరణం మొత్తం పసుపు మయంగా మారి ఆనందాన్ని పంచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ పాఠశాలలో ఎల్లో కలర్ డే నిర్వహించి.. విద్యార్థుల ద్వారా సందేశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. స్పూర్తితో విద్యార్థుల్లో సృజనాత్మకత, సానుకూలత, స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సతీష్, యజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30020/