schedule Friday, September 11, 2026

మురుగు వెతలకు చెక్...!

calendar_today October 26, 2024
person dharshininews
మురుగు వెతలకు చెక్...!
మురుగు వెతలకు చెక్...! - కాలువ నిర్మాణానికి ప్రాధాన్యం - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - 31వ వార్డులో డ్రైన్ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ వాసులకు మురుగు నుంచి వెతలు ఏర్పడకుండా చెక్ పెట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం పట్టణంలోని 31వ వార్డులో గగ్రాణి నివాసం వద్ద పెద్ద డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ బంటారం లావణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మురుగు నీరు నుంచి ఇబ్బందులు రాకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్‌లోని అన్ని వార్డుల్లో పార్టీలకతీతంగా మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభివృద్ధిలో పట్టణాన్ని అదర్శంగా నిలపడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. అందరి సహాకారంతో పట్టణ రూపు రేఖలు మారుస్తామన్నారు. అనంతరం చైర్ పర్సన్ పలు ప్రాంతాల్లో పర్యటించి సమప్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, మున్సిపల్ డీఈ, ఏఈ, వార్డు పెద్దలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30039/