schedule Monday, September 14, 2026

పానీ.. పోతే పోనీ..!

calendar_today October 29, 2024
person dharshininews
పానీ.. పోతే పోనీ..!
పానీ.. పోతే పోనీ..! - పైపులైన్ లీకేజీతో తాగునీటి వృథా - పట్టించుకోని పుర అధికారులు - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగునీటి విషయంలో తాండూరు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇందుకు ఉదహరణలు ఎన్నో ఉన్నాయి. పట్టణంలో తాగునీటీ పైపులైన్లు లీకేజీలకు గురై నీరంతా వృధాగా పారినా పట్టించుకోవడం లేదు. తాజాగా మంగళవారం తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీకి గురైంది. ఉదయం తాగునీటి సరఫరా సమయంలో నీరంతా రోడ్లపై వృథాగా పారింది. శాంత్ మహాల్ చౌరస్తా సమీపం నుంచి భద్రేశ్వర దేవాలయం ముందు వరకు రోడ్డు మొత్తం కాలువను తలపించింది. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని నివాసాలకు తాగునీరు సక్రమంగా సరఫరా కాలేదు. రోడ్లపై తాగునీరు వృథాగా పారడంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి లీకేజీలపై నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30104/