schedule Tuesday, July 07, 2026

కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు

calendar_today October 29, 2024
person dharshininews
కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు
కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు - తాండూరు గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తాం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని గ్రంథాలయాన్ని చైర్మన్ రాజేష్ రెడ్డి సందర్శించారు. ఇక్కడి గ్రం థాలయంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రంథాలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్త గ్రంథాలయా నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు మండలం కరణ్ కోట్‌ గ్రామంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచనతో కొత్త లైబ్రరీని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు తాండూరులోని గ్రంథాలయ పురోగతి పనులు పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డైరెక్టర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30124/