schedule Monday, September 14, 2026

తాండూరులో మాస్టర్ ప్లాన్ సర్వే ప్రారంభం

calendar_today October 29, 2024
person dharshininews
తాండూరులో మాస్టర్ ప్లాన్ సర్వే ప్రారంభం
తాండూరులో మాస్టర్ ప్లాన్ సర్వే ప్రారంభం - పట్టణ సరిహద్దులను పరిశీలించిన బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : అమృత్ భారత్‌ 2.0 కింద తాండూరు మున్సిపల్లో అమలు చేయబోతున్న మాస్టర్ సర్వే మంగళవారం ప్రారంభమయ్యింది. డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నియమించిన ప్రత్యేక బృందం పట్టణంలో సర్వే ప్రారంభించింది. మొదటి రోజు తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లి, భూకైలాస్, రాజీవ్ కాలనీ, గౌతాపూర్ రోడ్డు మార్గంలో ఉన్న సరిహద్దు ప్రాంతంలో భౌగోళిక సర్వే చేపట్టారు. సాయంత్రం సమయం దాటి పోవడంతో డ్రోన్ సాధ్యపడలేదు. సర్వే ఆఫ్ ఇండియా బృందంతో పాటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని సర్వే బృందం తెలిపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30104/