schedule Tuesday, July 07, 2026

పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే

calendar_today October 30, 2024
person dharshininews
పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే
పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే - తప్పుల్లేకుండా సర్వే చేపట్టాలి - ఎన్యుమరేటర్, సూపర్ వైజర్లకు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం వచ్చేనెల నుంచి చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మాస్టర్ ట్రైనర్ భాను ప్రకాష్ అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి సమక్షంలో సర్వే ఎన్యుమరేటర్, సూపర్ వైజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాను ప్రకాష్ సర్వే నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించిన పార్ట్ 1, 2 రెండు విభాగాలకు సంబంధించిన ఫార్మెట్లలో వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. కుటుంభ సభ్యుల వివరాలు, భూమి, ఆర్థిక అంశాలను పొందు పర్చాలన్నారు. వివరాలను సేకరించే సమయంలో కుటుంబ యజమాని, సభ్యులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అప్పడే సర్వేకు అందరి సహాకారం ఉంటుందన్నారు. 75 అంశాలు ఉన్న ఫార్మెట్లో అన్ని జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ సర్వేను పకబ్బందీగా నిర్వహించి, జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్, ఏఈ ఖాజా హుస్సేన్, మెప్మా కోఆర్డినేటర్ విశాల, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30232/