schedule Tuesday, July 07, 2026

ఆర్. కృష్ణయ్య పోరాటాలతోనే మెస్ చార్జీల పెంపు

calendar_today November 2, 2024
person dharshininews
ఆర్. కృష్ణయ్య పోరాటాలతోనే మెస్ చార్జీల పెంపు
ఆర్. కృష్ణయ్య పోరాటాలతోనే మెస్ చార్జీల పెంపు - సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు - బీసీ వసతి గృహాల్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి - జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య చేసిన పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రంలోని వసతి గృహాల్లో విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచడం జరిగిందని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంపై రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్.కృష్ణయ్య వసతి గృహాల విద్యార్థుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. గతంలో ఉన్న మూడో నుంచి ఏడో తరగతి వరకు రూ. 950 నుండి రూ. 1330 వరకు, ఎనిమిది నుండి పదో తరగతి వరకు రూ. 1100 నుండి రూ. 1540కు, కాలేజ్ విద్యార్థులకు రూ. 1500 నుండి రూ. 2100కు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అదేవిధంగా బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు లేవని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వసతి గృహాల్లో గురుకులాల్లో విద్యార్థులకు ఇకనైనా నాణ్యమైన భోజనాన్ని అందే విధంగా, పెంచిన కాస్మోటిక్ చార్జెస్ ని సరియైన సమయానికి విద్యార్థులకు చేరే విధంగా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30277/