schedule Friday, September 11, 2026

తాండూరు నుంచి శబరి పాదయాత్ర

calendar_today November 3, 2024
person dharshininews
తాండూరు నుంచి శబరి పాదయాత్ర
తాండూరు నుంచి శబరికి పాదయాత్ర - బయల్దేరిన అయ్యప్ప స్వాములు - ఆశీర్వాదం తీసుకున్న పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలైకు మహా పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. ప్రతి యేడాది తాండూరుకు చెందిన అయ్యప్ప స్వాములు ఈ మహాపాదయాత్ర చేపడుతున్నారు. ఆ ఈ యేడాది కూడా అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆదివారం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమలైకు మహా పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. 37 రోజుల పాటు సుమారు 1400 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొసాగుతోంది. మార్గమద్యలోని యాలాల మండలం జుంటుపల్లి వద్ద పాదయాత్రగా బయల్దేరిన అయ్యప్ప స్వాములను తాండూరు బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు కలుసుకున్నారు. స్వాములను దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాముల పాదయాత్ర సవ్యంగా కొనసాగాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామిని ప్రార్థించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30307/