schedule Tuesday, July 07, 2026

పేకాట కలవరం..!

calendar_today November 4, 2024
person dharshininews
పేకాట కలవరం..!
పేకాట కలవరం..! - ఏడుగురుపై కేసు, రూ.80వేలు స్వాదీనం..? - అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు పుకార్లు..? - ఫోటోలు, వీడియోలు బహిర్గంతకు నిరాకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో పేకాట రాయుళ్ల ఘటన కలవరం రేపుతోంది. గుట్టుగా ఆడుతున్న పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించినట్లు పక్కా సమాచారం. ఇందులో 7గురు పట్టుబడగా.. అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాండూరు పట్టణం నెహ్రు గంజ్ పరిధిలో ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ ఫోలీసులు దాడులు నిర్వహించనట్లు.. తెలిసింది. ఇందులో తాండూరు ప్రాంతానికి చెందిన 7 మంది బడా నేతలు, వ్యాపారులు ఉన్నట్లు గుస గుసలు వినిపించాయి. వారి వద్ద నుంచి రూ. 80వేల నగదును స్వాదీనం చేసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంఘటన తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వ్యాపారులు ఉండడంతో విషయాన్ని బయటకు రానీయకుండా తెరవెనుక రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే తాండూరులో పేకాట నిందితుల ఘటన కలవరం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30320/