schedule Friday, September 11, 2026

ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించండి

calendar_today November 4, 2024
person dharshininews
ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించండి
ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించండి - ఉపయోగాలు, ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - తాండూరు కార్యాలయంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుల, సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లుగా నియామకమైన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు సంగమేశ్వర్ ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి కుల, సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుందన్నారు. ఈ సర్వే ఉపయోగాలు, ఉద్దేశాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికి వెళ్లి మర్యాదగా నడుచుకుని పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30331/