schedule Friday, September 11, 2026

తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం

calendar_today November 5, 2024
person dharshininews
తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం
తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం - సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, గిరిజన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు రాంజీ రాథోడ్ ఆధ్వర్యంలో ఏడీ శంకర్ నాయక్ ను తాండూరు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఏడీ శంకర్ నాయక్ ను శాలువా, పూలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి చెందిన శంకర్ నాయక్ సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరు మండలం అంతారం తాండా, సంకిరెడ్డిపల్లి తాండాలలోని సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు రాథోడ్, గోవింద్ రాథోడ్, చరణ్ పవార్, రాము, దేవా, రాజేందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30361/