schedule Friday, September 11, 2026

మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

calendar_today November 5, 2024
person dharshininews
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి - మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - వరి కొనుగోళ్లపై మంత్రులతో విడియో కాన్ఫరెన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లతో ఎదురవుతున్నా ఇబ్బందులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ జరుగుతున్నాయని వివరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30363/