schedule Tuesday, July 07, 2026

సర్వే పేరుతో సైబర్ మోసాలు

calendar_today November 8, 2024
person dharshininews
సర్వే పేరుతో సైబర్ మోసాలు
సర్వే పేరుతో సైబర్ మోసాలు - లింకులు పంపితే జాగ్రత్తగా ఉండాలి - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై కొందరు సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న సర్వేపై గుర్తుతెలియని సైబర్ నేరస్తులు ప్రజలకు ఆన్ లైన్ లింకులు పంపుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి లింకులను ప్రజలు ఎవ్వరు ఓపెన్ చేయరాదని సూచించారు. సర్వే పేరుతో ఎవరైనా ఫేక్ కాల్ చేస్తే స్పందించరాదన్నారు. ఎలాంటి వివరాలను చెప్పరాదన్నారు. ఇంటింటి సర్వే మ్యాన్వల్ పద్దతిలో జరుగుతుందని, అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు ఇంటింటికి వచ్చి వివరాలను సేకరిస్తారని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30409/