schedule Tuesday, July 07, 2026

గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

calendar_today November 8, 2024
person dharshininews
గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక - సన్మానించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లోని హమాలీ కార్మిక సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నికైంది. గౌరవాధ్యక్షులుగా భీమప్ప, అధ్యక్షులుగా మస్తిపురం చిన్న అంజప్ప, ఉపాధ్యక్షులుగా డి.అశోక్, జే. అశోక్, ప్రధాన కార్యదర్శిగా చంద్రబండ నర్సింలు, సహాయ కార్యదర్శులుగా భీరప్ప (వీరేశం), గుండప్ప, కోశాధికారులుగా కె. బాలప్ప, వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాము, చింతలయ్య, కుర్వ మల్లప్ప, శ్రీనివాస్, సలహాలదారులుగా భద్రప్ప, నర్సింలులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, పలువురు వ్యాపారులు, సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30415/