schedule Tuesday, July 07, 2026

డ్రోన్ సర్వే కంప్లీట్..!

calendar_today November 9, 2024
person dharshininews
డ్రోన్ సర్వే కంప్లీట్..!
డ్రోన్ సర్వే కంప్లీట్..! - మాస్టర్ ప్లాన్ అమలయ్యేది అప్పుడే - అప్పటి వరకు ఏం చేస్తారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాలను అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అమృత్‌ 2.0 ద్వారా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. ఈ పథకంలో ఎంపికైన తాండూరు మున్సిపల్‌లో మాస్టర్ ప్లాన్ సర్వే చేపట్టారు. డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా బృందం కలిసి పట్టణంలో సర్వే ప్రారంభించారు. గత నెలలో భౌగోళిక సర్వే నిర్వహించి ఈనెల 1 నుంచి డ్రోన్ సర్వే చేశారు. దాదాపు వారం రోజుల పాటు పట్టణంలో డ్రోన్ సర్వే కొనసాగింది. ఈ సర్వేలో రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. డ్రోన్‌ సర్వేలో మున్సిపాలిటీ ఉపరితలం ఎత్తు, చెరువులు, వాగులు, డ్రైనేజీ, ఇళ్లు, చెట్లు, రోడ్లు, వైకుంఠదామాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, మార్కెట్లు, సెల్‌ టవర్లు, మరుగుదొడ్లు, వాటర్‌ ట్యాంకులు, రిజర్వాయర్లు తదితర వనరులన్నింటినీ మ్యాపింగ్‌ చేశారు. మున్సిపల్ పరిధిలో సుమారు 5500 కిలో మీటర్ల సర్వే చేశారు. శుక్రవారంతో సర్వే పూర్తయ్యింది. మాస్టర్ ప్లాన్ అమలు ఎప్పుడు అంటే...? డీటీసీపీ, సర్వే ఆఫ్‌ ఇండియా బృందం పట్టణంలో సర్వే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేధిక అందిస్తారు. సర్వే మ్యాపింగ్ ద్వారా పట్టణంలో రాబోయే 20 ఏండ్లకు సరిపడా అభివృద్ది, మౌళిక వసతుల కల్పనపై ప్రణాళికలు రూపొందిస్తారు. అన్ని విధాలుగా తయారు చేసిన ప్లాన్ అమలుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశ పెట్టి తీర్మానం చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరువాతనే మాస్టర్ ప్లాన్ కార్యరూపం దాల్చుతుందని చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 6నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. అంటే 6 నెలల తరువాతనే మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30431/