schedule Tuesday, July 07, 2026

తప్పులు దొర్లకుండా సర్వే చేయాలి

calendar_today November 10, 2024
person dharshininews
తప్పులు దొర్లకుండా సర్వే చేయాలి
తప్పులు దొర్లకుండా సర్వే చేయాలి - తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ - పట్టణంలో కొనసాగుతున్న సర్వే పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో తప్పులు దొర్లకుండా తడబడకుండా పూర్తి చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం కన్యా పాఠశాల సమీపంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు. సర్వేలో పాల్గొన్న మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డితో వివరాలను ఆరా తీశారు. సర్వే ఎలా జరుగుతుంది..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? సర్వేకు సహకారం లభిస్తుందా.. లేదా..? అనే వి వరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికి ఒక ఇంటి వద్ద సర్వే 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు సమయం పడుతుందని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు మేనేజర్ నరేందర్ రెడ్డి వివరించారు. ఇందుకు సబ్ కలెక్టర్ సర్వే యొక్క ఉపయోగాలను, ఉద్దేశాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇంటి యజమానులతో మర్యాదగా మెలిగి వివరాలను రాబట్టాలన్నారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తడబడకుండా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి మాణిక్ రావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30457/