schedule Tuesday, July 07, 2026

అధికారులపై దాడి గర్హనీయం..!

calendar_today November 11, 2024
person dharshininews
అధికారులపై దాడి గర్హనీయం..!
అధికారులపై దాడి గర్హనీయం..! - ఇలాంటి చర్యలు చెడ్డ సంస్కృతి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడులు చేయడం గర్హనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మ విలేజ్ కంపెనీ చర్చల కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామ రైతులు, ప్రజలు దాడికి పాల్పడిన ఘటనను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఖండించారు. చర్చల కోసం వచ్చిన అధికారులపై అనాలోచితంగా దాడులు చేయడం చెడ్డ సంస్కృతిగా మిగులుతుందన్నారు. ఇలాంటి చర్యలు అధికారుల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తాయన్నారు. చెప్పుడు మాటలు, స్వార్థం కోసం దాడులు చేయడం పద్దతి కాదన్నారు. మరోసారి ఎవ్వరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడరాదన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30489/