వైభవంగా పల్లకి సేవ..!
November 15, 2024
dharshininews
వైభవంగా పల్లకి సేవ..!
- కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
- భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాళికాదేవి ఆలయంలో ఆమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. గత 25 ఏండ్లుగా ఆలయంలో కార్తీక మాసం పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం మాస పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవలో ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. భజన కీర్తనలతో ఆలయం మార్మోగింది. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి, ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30557/