నాగారం నర్సింలు ఇకలేరు..!
November 20, 2024
dharshininews
నాగారం నర్సింలు ఇకలేరు..!
- గుండెపోటుతో కన్నుమూత
- సంతాపం తెలిపిన రాజకీయ నేతలు
తాండూరు,దర్శిని ప్రతినిధి : బీజేపీ సీనీయర్ నాయకులు, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు ఇకలేరు. బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన తాండూరు రాజకీయాలలో దిగ్భ్రాంతికి గురిచేసింది. నాగారం నర్సింలు సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన తాండూరు మున్సిపల్ చైర్మన్ గా నాగారం నర్సింలు పనిచేశారు. చైర్మన్ గా, బీజేపీ పార్టీ బలో పేతానికి విశేష కృషి చేశారు. బీజేపీ పార్టీలో ఉన్నప్పటికి ఆరోగ్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన కుమారులు నాగారం మల్లేశం బీజేపీ పట్టణ అధ్యక్షులుగా, నాగారం జగదీశ్వర్ కురుమ సంఘం డివిజన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మరొ వైపు నాగారం నర్సింలు మరణం పట్ల తాండూరుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30632/