schedule Sunday, September 13, 2026

మంచి నాయకుడు నాగారం నర్సింలు..!

calendar_today November 23, 2024
person dharshininews
మంచి నాయకుడు నాగారం నర్సింలు..!
మంచి నాయకుడు నాగారం నర్సింలు..! - ఆయన మరణం బీజేపీ ఉమ్మడి జిల్లాకు తీరనిలోటు - సంతాపం తెలిపిన హరియాణ గవర్నర్‌ దత్తాత్రేయ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాకు చెందిన బీజేపీ సీనీయర్ నాయకులు, తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు మరణం చాలా బాధాకరమని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో నాగారం నర్సింలు మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. తనకు నాగారం నర్సింలు అత్యంత సన్నిహితులని గుర్తుచేసుకున్నారు. సేవా భావన, నమ్రత, వినయం కలిగిన నాయకుడు నాగారం నర్సింలు అని అన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా తాండూరు పట్టణం అభివృధ్ధికోసం అనేక పధకాలు చేపట్టారని ఆయన సేవలను కొనియాడారు. జాతీయ భావాన్ని, దేశ భక్తిని నమ్ముకొని దానికోసమే నిరంతరం కృషిచేశారని, బలహీన వర్గాల నుంచి వచ్చి రాజకీయంలో ఎదగడం, ప్రజాసేవ అందించి మంచినాయకునిగా పెరుగడించడం గొప్ప విషయమని అన్నారు. నాగారం నర్సింహులు మరణం వల్ల వికారాబాద్ జిల్లా ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని, వారి మృతి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్ట సమయాన ఈ బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నాగారం నర్సింలు కుటుంబానికి హరిణాయ గవర్నర్ సంతాపం తెలపడం పట్ల కుటుంభ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30719/