schedule Tuesday, July 07, 2026

మున్సిపల్లో దోపడి పాలన..!

calendar_today December 4, 2024
person dharshininews
మున్సిపల్లో దోపడి పాలన..!
మున్సిపల్లో దోపడి పాలన..! - చైర్ పర్సన్, కమీషనర్ కుమ్మక్కు - అద్దె జేసీబీ బిల్లులు దోచుకుంటున్నారు - మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో దోపిడి పాలన కొనసాగుతుందని గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మండిపడ్డారు. బుధవారం ఆమె తన వార్డులో పర్యటించారు. వార్డులో మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు చైర్ పర్సన్, కమీషనర్ సహకరించడం లేదని ఆరోపించారు. కాలువలు శుభ్రం చేసేందుకు జేసీబీని పెట్టాలని కోరితే పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ జేసీబీ మరమ్మత్తులకు గురైందని చెబుతున్నారని అన్నారు. అద్దె జేసీబీని పెట్టుకుని బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో చైర్ పర్సన్, కమీషనర్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజా ధనం దోపిడికి పాల్పడ్డుతున్నారని విమర్శించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ విషయంలో దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. లేదంటే జిల్లా కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31205/