schedule Tuesday, July 07, 2026

విధుల్లో నిర్లక్ష్యం చేయరాదు

calendar_today December 7, 2024
person dharshininews
విధుల్లో నిర్లక్ష్యం చేయరాదు
విధుల్లో నిర్లక్ష్యం చేయరాదు - ప్రజలకు అందుబాటులో ఉండాలి - రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయాలి - తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ - బషీరాబాద్‌లో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల సందర్శన - జెడ్పీహెచ్ఎస్, వసతిగహాల్లో తనిఖీలు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం చేయరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. శనివారం బషీరాబాద్‌ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు జెడ్పీహెచ్ఎస్, వసతి గహాలను తనిఖీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ధరణి రికార్డులను పరిశీలించారు. భూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో బోధనా, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వసతి గృహాల్లో భోజనంను పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మరోవైపు తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను కోర్విచేడ్ గని గ్రామ మాజీ సర్పంచ్ హన్మంతు కలిసీ గ్రామంలో ఓటర్లు వేరే గ్రామంలోకి వెళ్లడం వల్ల నిధులు రావడం లేదని తెలిపారు. దీనిపై దృష్టి సారించి పరిష్కరించేలా చూస్తామని సబ్‌ కలెక్టర్ హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సబ్‌ కలెక్టర్ కార్యాలయ అధికారి మాణిక్ రావు, తహసీల్దార్ వెంకటేష్‌, ఎంపీడీఓ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31304/