schedule Tuesday, July 07, 2026

గర్భవతికి నో ఎంట్రీ..!

calendar_today December 15, 2024
person dharshininews
గర్భవతికి నో ఎంట్రీ..!
గర్భవతికి నో ఎంట్రీ..! - బతిమాలిన అనుమతించని వైనం - నిమిషం లేటుతో పరీక్షకు దూరం తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూపు-2 పరీక్షకు వచ్చిన గర్భవతికి నిర్వహకులు నో ఎంట్రీ చెప్పారు. పరీక్షకు అనుమతించాలని బతిమాలినా అంగీకరించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైందని నిండు గర్భిణీ పరీక్షు దూరం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం ఇందూరుకు చెందిన వీణ నిండు గర్భిణీగా ఉంది. అయినా కూడా గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమయ్యింది. తాండూరు పట్టణం చైతన్య జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూపు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆదివారం ఉదయం భర్తతో కలిసి వచ్చి పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పరీక్షా కేంద్రం వద్ద 9-30గంటలకు ముందే ఆమెను నిర్వహకులు తనిఖీ చేశారు. పక్కకు వచ్చి భర్తను పలకరించేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి నిమిషం ఆలస్యం జరిగిందని నిర్వహకులు గేటు వేశారు. గేటు బయటే ఉండిపోయిన వీణ నిర్వహకులను లోపలికి అనుమతించాలని బతిమిలాడింది. నిమిషం నిబంధన ఉన్న కారణంగా లోపలికి అనుమతించలేదు. చాలా సేపు బతిమి లాడిన ఎవ్వరు అనుమతించక పోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. మరోవైపు ఆమెతో పాటు ఆలస్యంగా వచ్చిన అరుణ, కుసుమ అనే యువుతులను కూడా పరీక్షకు అనుమతించలేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31438/