schedule Monday, July 06, 2026

శరణు.. శరణు.. శబరీ గీరీషా..!

calendar_today December 18, 2024
person dharshininews
శరణు.. శరణు.. శబరీ గీరీషా..!
శరణు.. శరణు.. శబరీ గీరీషా..! - అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ - పైలెట్ నివాసంలో మార్మోగిన శరణు గోష - స్వామికి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, రాజకీయ నేతలు తాండూరు,దర్శిని ప్రతినిధి : శరణు.. శరణు.. శబరీ గిరీషా.. అంటూ అయ్యప్ప స్వామి భజన కీర్తనలతో తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. బుధవారం ఆయన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది. రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడిపూజకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములు, బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చారు. అయ్యప్ప స్వామికి వేద మంత్రా చ్చరణల మద్య రోహిత్ రెడ్డి అభిషేకాలు చేశారు. భక్తి శ్రద్ధలతో మెట్ల పూజ నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు భక్తి పారవశ్యాన్ని నింపాయి. స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమం శోభాయమానంగా నిలిచింది. అనంతరం రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వాములకు సద్ది నిర్వహించారు. రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పడిపూజకు బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయన్నారు. అందరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తీ రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి, పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, నరేందర్ గౌడ్, పెద్దేముల్ మాజీ ఎంపీపీ అనురాధ రమేష్‌, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, శ్రీనివాస్ రెడ్డి, మహిళ నాయకురాలు శకుంతల, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, వివిధ మండాల నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31538/