వడ్డె ఓబన్న త్యాగాలు స్పూర్తి దాయకం
January 11, 2025
dharshininews
వడ్డె ఓబన్న త్యాగాలు స్పూర్తి దాయకం
- ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలి
- బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సాయుధ పోరాట యోధుడు వడ్డె ఓబన్న చేసిన త్యాగాలు భావి తరాలకు స్పూర్తిదాయకమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. సంచార జాతి వడ్డెర కులానికి చెందిన వడ్డె ఓబన్న బ్రిటీష్ కాలంలో పాలేగాళ్ల అణచివేత ఉద్యమంలో ఉద్యమం చేపట్టారని తెలిపారు. ఉయ్యాల వాట నర్సింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైనాధ్యాక్షుడుగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదన్నారు. బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల్ల అడవుల్లో సైతం బ్రీటీష్ సైన్యాన్ని ఊచకోతతో ఉరుకులు పెట్టించారని గుర్తుచే శారు. వడ్డెర జాతి మాత్రమే కాదు సభ్య సమాజం వడ్డె ఓబన్న జయంతిని జరుపుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం జనవరి 11న జయంతిని అధికారంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/32192/