schedule Monday, July 06, 2026

మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న

calendar_today January 13, 2025
person dharshininews
మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న
మైలాపురం మల్లన్నను దర్శించుకున్న శంకరన్న - మంత్రాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం యాదగిరి సమీపంలోని మైలాపురం మల్లన్న స్వామిని తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రతి యేడాది సంక్రాంతి సందర్భంగా శంకర్ యాదవ్ కుటుంబీకులు మల్లన్న స్వావి ని దర్శించుకుని పూజలు నిర్వహించే ఆనవాయితిని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యేడాది సోమవారం శంకర్ యాదవ్ మైలాపూర్ మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శంకర్ యాదవ్ మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామిని కూడా దర్శించుకున్నారు. పలు దేవాలయాల్లో దేవతా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట మిత్ర బృందం మనోహర్ యాదవ్, జొన్నల వినోద్, వేణుగోపాల్ రెడ్డి, ప్రేమ్ రాజ్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32252/