దత్తాత్రేయ సన్నిధిలో శంకరన్న..!
January 29, 2025
dharshininews
దత్తాత్రేయ సన్నిధిలో శంకరన్న..!
- మౌని అమావాస్య సందర్భంగా పూజలు
- దర్శించుకున్న మిత్ర బృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్దాపూర్ లో వెలసిన దత్తాత్రేయ స్వామి సన్నిధిలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తరించారు. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా శంకర యాదవ్ తన మిత్ర బృందంతో కలిసి సందర్శించారు. ఆలయ పురోహితుల సమక్షంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. అందరు దైవభక్తిని అలవర్చుకోవాలి అన్నారు. దత్తాత్రేయుని దరి ంచుకున్న వారిలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు విజయ్ కుమార్, తాండూరుకు చెందిన మనోహర్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, ప్రేమ్ రాజ్, బంటు మల్లప్ప ముదిరాజ్, జొన్నల వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/32664/