schedule Friday, September 11, 2026

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

calendar_today January 29, 2025
person dharshininews
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి - బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ - తాండూరులో టెన్త్ విద్యార్థులకు గైడ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని హైదరాబాద్ బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. బుధవారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 2 ఉర్దూ మీడియం స్కూల్ విద్యార్థులకు సలార్ ఏ మిల్లత్ వారి సహాకారంతో ఆన్ ఇన్ వన్ గైడ్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ కార్పోరేటర్ మహమ్మద్ ఖాదర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పదో తరగతి చదువుతున్న 190 మంది వి ద్యార్థులకు గైడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ మాట్లాడుతూ వచ్చే పదోతరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉద్దేశంతో గైడ్లను పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు. గత కొనె ్నళ్లుగా పరీక్షలకు ముందు విద్యార్థులకు గైడ్లను పంపిణీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా చదువుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత చదువులతో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం తాండూరు పట్టణ అధ్యక్షులు హాది షహేరీ, కార్యదర్శి బీఆర్ యూనిస్, కోశాధికారి నబీ సాబేర్, ధారూర్ మండల అధ్యక్షులు మోయిజ్ ఖురేషీ, నాయకులు వసీం ఫారుఖ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32667/