schedule Friday, September 11, 2026

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

calendar_today January 29, 2025
person dharshininews
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - బాల్య వివాహాలు, ర్యాగింగ్ లకు పాల్పడితే చర్యలు - న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థి దశ నుంచే చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తాండూరు మండల లీగల్ సర్వీసు కమిటి ప్యానల్ న్యాయవాదులు సూచించారు. బుధవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలు, ర్యాగింగ్, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదంర్భంగా ప్యానల్ న్యాయవాదులు జిలాని, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం నేరమని, ఇందుకు 2సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమాన విధించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరైనా ర్యాగింగ్, వేధింపులకు పాల్పడినా కూడా చర్యలు తప్పవన్నారు. బాలికలపై వేధింపులకు పాల్పడితే ఫోక్సో చట్టం ప్రకారం శిక్ష తప్పదన్నారు. విద్యార్థుల దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు కోర్టు సిబ్బంది ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ ప్రవీణా రెడ్డి, ఉపాధ్యాయులు, మహిళ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32671/