schedule Monday, July 06, 2026

రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..!

calendar_today January 30, 2025
person dharshininews
రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..!
రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..! - మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - 24వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్దశ వస్తుందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 24వ వార్డులో ఎస్ఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈకార్యక్రమానికి చైర్మన్ బాల్ రెడ్డి హాజరై వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తో కలిసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పాలకవర్గం చివరి దశలో వార్డుకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని, పనులు వేగంగా చేపట్టడం కూడా సంతోషకరమన్నారు. కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ కౌన్సిలర్ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నాయకులు ఉప్పరి మల్లేశం, చంద్రమోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32714/