schedule Monday, July 06, 2026

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

calendar_today January 31, 2025
person dharshininews
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ - కార్యకర్త కుటుంబానికి రూ. 2లక్షల బీమా - చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం అడ్కిచెర్ల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చాకలి నర్సింలు గత కొన్ని రోజుల క్రితం అనారొ గ్యంతో మృతి చెందారు. పార్టీ సభ్యత్వం సమయంలో బీఆర్ఎస్ పార్టీ రూ. 2లక్షల బీమా సాయం అందిస్తుందని గతంలోనే ప్రకటించింది. అయితే మృతి చెందిన నర్సింలుకు పార్టీ సభ్యత్వంతో పాటు బీమా వర్తించడంతో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ. 2లక్షల బీమా డబ్బులను మంజూరు చేసింది. శుక్రవారం తాండూరు పట్టణానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చె తుల మీదుగా నర్సింలు భార్య లక్ష్మీకి అందజేశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలక ఆపద సమయంలో అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32739/