schedule Monday, July 06, 2026

కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం

calendar_today January 31, 2025
person dharshininews
కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం
కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతం - బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ - బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా వీరమణి నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్త కార్యవర్గాలతో బీసీ సంఘం బలోపేతంకు కృషి చేయడం జరుగుతుందని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారీ, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ ల సమక్షంలో బషీరాబాద్ మండల బీసీ సంఘం అధ్యక్షురాలుగా వీరమణిని నియమించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ఆమెకు నియమక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలుగా నియామకం అయిన వీరమణి మండలంలో బీసీ సంఘాన్ని పటిష్ట పరిచేలా పనిచేయాలన్నారు. మండల కమిటిని ఏర్పాటు చేసి బీసీలను చైతన్య పర్చాలన్నారు. అదేవిధంగా మండల అధ్యక్షురాలుగా నియామకం అయిన వీరమణి మాట్లాడుతూ తనకు అధ్యక్షురాలుగా అవకాశం కల్పించడం పట్ల జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారిలకు ధన్యవాదలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘం అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అనంతరం పులువురు వీరమణిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అనిత, నర్సమ్మ, మంజుల, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, యువనాయకులు జుంటుపల్లి వెంకట్, సయ్యద్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32743/