schedule Monday, July 06, 2026

మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి

calendar_today January 31, 2025
person dharshininews
మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి
మున్సిపల్‌లో లక్ష్మప్ప సేవలు గుర్తుండి పోతాయి - పదవి విమరణ సందర్భంగా ఘన సన్మానం - సత్కరించి వీడ్కోలు పలికిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ శాఖలో పబ్లిక్ హెల్త్ వర్కర్ లక్ష్మప్ప సేవలు గుర్తిండి పోతాయని ఆ శాఖ అధికారులు కొనియాడారు. మున్సిపల్‌లోని ఇంజనీరింగ్ విభాగం వాటర్ సప్లయ్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న లక్ష్మప్ప పదవి విరమణ పొందారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్యాలయంలో లక్ష్మప్పకు పదవి విరమణ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, సీనీయర్ అసిస్టెంట్ రమేష్‌, ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఎం.వెంకటయ్య, జూనియర్ అసిస్టెంట్ సునీత తదితరులు లక్ష్మప్పను సతీసమేతంగా సన్మానించారు. విధుల్లో స్పూర్తిగా ఉంటూ పదవి విరమణ పొందిన ఆయన సేవలు గుర్తిండి పోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, బందు మిత్రులు, కార్మికులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32746/