schedule Monday, July 06, 2026

మెరుగైన సేవలే లక్ష్యం..!

calendar_today February 1, 2025
person dharshininews
మెరుగైన సేవలే లక్ష్యం..!
మెరుగైన సేవలే లక్ష్యం..! - ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి - పకడ్బందీగా పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా - వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ - తాండూరు మున్సిపల్‌ను సందర్శించిన ప్రత్యేకాధికారి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దృష్టిసారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ అన్నారు. మున్సిపల్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తొలిసారి ఆయన తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. శనివారం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్యం తదితర విభాగాల అధికారులు, వార్డు ఆ ఫీసర్లు, సిబ్బందితో సమీక్ష జరిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక పాలనలో మున్సిపల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టిసారించడం జరుగుతుందన్నారు. తాండూరులో మున్సిపల్ కమీషనర్, అధికారులు, వార్డు ఆఫీసర్ల సమన్వయంతో పాలన అందించడం జరుగుతుందన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే సహాకారంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే మున్సిపల్ కమీషనర్ ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా, ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటయ్య, ఆర్వో, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32752/