schedule Monday, July 06, 2026

శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరభ్యాసం..!

calendar_today February 3, 2025
person dharshininews
శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరభ్యాసం..!
శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరభ్యాసం..! - బాసర సరస్వతి కుంకుమతో పూజలు - అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ పీవీఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసంత పంచమిని పురస్కరించుకొని తాండూర్ పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా జరిగింది. బాసర సరస్వతీ ఆలయం నుంచి తీసుకువచ్చిన కుంకుమతో... పూజారి మంత్రోచ్ఛనాలతో... కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి(పీవీఆర్) ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు, సరస్వతీ మాత అలంకరణ, వేషాధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతీ మాత అన్నారు. ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన జరిపినప్పటికీ దేశ సంస్కృతి, సం ప్రదాయాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. భావితరాల వారికి చక్కటి భవిష్యత్తును అందించేందుకు ఉచితంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. 100 మందికి పైగా చిన్నారుల చదువుకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32773/