schedule Monday, July 06, 2026

కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ

calendar_today February 3, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ
కేవీసీఎస్‌లో వసంతపంచమి శోభ - వైభవంగా సామూహిక అక్షరాభ్యాస వేడుకలు - చిన్నారుల చదువుకు 'శ్రీ'కారం - ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయ ఆవరణలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో(కేవీసీఎస్‌) సామూహిక అక్షరాభ్యాస వేడుకలు వైభవంగా నిర్వహించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. దీంతో స్కూల్ వాతావరణలో వసంత పంచమి శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసానికి చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరి సమక్షంలో చదువుల తల్లి సరస్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. శ్రీ అనే అక్షరంతో చిన్నారుల చదువులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా స్కూల్లో వసంత పంచమి విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్లు సతీష్, మల్లేపల్లి వెంకటేశం, మల్లేశంలు మాట్లాడుతు చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానం, వాక్కు, విద్య శక్తులు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32789/