schedule Monday, July 06, 2026

తొలి కవయిత్రికి తొలి విగ్రహం..!

calendar_today February 7, 2025
person dharshininews
తొలి కవయిత్రికి తొలి విగ్రహం..!
తొలి కవయిత్రికి తొలి విగ్రహం..! - తాండూలో ఏర్పాటు చేసిన కుమ్మర సంఘం - రేపు ఆవిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా పేరు పొందిన కవయిత్ర ఆతుకూరి మొల్ల తొలి విగ్రహా ఆవిష్కరణకు ముహుర్తం ఖరారయ్యింది. తాండూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాండూరులో తొలి కవయిత్రి మొల్ల విగ్రహం ఇదే మొదటిది కానుంది. తాండూరు మండలం అంతారం గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కుమ్మర సంఘం నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడ జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజ్ గిరి దయానంద్, గౌరవాధ్యక్షులు బండారు బిక్షపతి, ఆమంచి రాజలింగం, కుమ్మర లక్ష్మీనారాయణ, నిమ్మలూరి శ్రీనివాస్, ఎగిరిశెట్టి వీరయ్య, జిల్లా అధ్యక్షులు కుమ్మరి మారుతి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కుమ్మరి నారాయణ, మహేందర్, కుమ్మరి విశ్వనాథ్ లు హాజరవుతున్నట్లు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మర పాండు, ప్రధాన కార్యదర్శి కుమ్మర అనంతయ్యలు తెలిపారు. కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని విజ్ఙప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32919/