schedule Monday, July 06, 2026

హోరాహోరీగా కబడ్డీ పోటీలు...!

calendar_today February 10, 2025
person dharshininews
హోరాహోరీగా కబడ్డీ పోటీలు...!
హోరాహోరీగా కబడ్డీ పోటీలు...! - సత్తా చాటిన తాండూరు క్రీడాకారులు - విజేతగా వికాబాద్‌ జట్టు, రన్నర్‌గా తాండూరు జట్టు - అభినందించిన నాయకులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కబడ్డీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. గత రెండు రోజులుగా పట్టణంలోని వాల్మీకి నగర్‌లో కాంగ్రెస్ సినీయర్ నాయకులు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొత్తం 20 కబడ్డీ జట్లు పాల్గోని పోటీ పడ్డాయి. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వికారాబాద్ జట్టు, తాండూరు వాల్మీకి నగర్ శివాజీ జట్టు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో వికారాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. తాండూరు వాల్మీకీ నగర్ శివాజీ జట్టు రన్నర్‌గా నిలించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ హాజరయ్యారు. విజేత జట్టుకు రూ. 10వేలు, రన్నర్ జట్టుకు రూ. 8వేల నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయన్నారు. క్రీడల వల్ల క్రీడాకారులలో పోటీ తత్వం, తత్సంబంధాలు పెరుగుతాయన్నారు. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను అందరు ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ , సిద్దు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32999/