schedule Monday, July 06, 2026

శ్రీవారి కళ్యాణం చూతము రారండి..!

calendar_today February 11, 2025
person dharshininews
శ్రీవారి కళ్యాణం చూతము రారండి..!
శ్రీవారి కళ్యాణం చూతము రారండి..! - రేపు దస్తగిరిపేట్లో స్వామి వారి కళ్యాణం, రథోత్సవం - ముస్తాబైన శ్రీ వేంకటేశ్వర దేవాలయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో రేపు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు, అర్చకులు వెంకటాచార్ శుక్రవార్, రాఘవాచార్ శుక్రవార్, పురందరాచార్ శుక్రవారు తెలిపారు. ఈ నెల 4 నుంచి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా రేపు బుధవారం ఉదయం 10-30 గంటలకు శ్రీ దేవీ భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి సమేతంగా స్వామి వార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారి రథోత్సవ వేడుకలు జరుగుతాయని, అదేవిధంగా సాయంత్రం అశ్వవాహన సేవ, ఉయ్యాల సేవ, మహా మంగళహారతి, స్వస్తి వచన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 13న ద్వజ అవరోహణముతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. శ్రీవారి భక్తులు ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33002/