schedule Monday, July 06, 2026

రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..!

calendar_today February 14, 2025
person dharshininews
రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..!
రసీదులు లేకుండా పన్నులు కట్టొద్దు..! - పట్టణ వాసులకు మున్సిపల్ కమీషనర్ హెచ్చరిక - గతంలో ఏం జరిగిందో అంటూ.. షాకింగ్ విషయం వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రజలు రసీదులు లేకుండా ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఆస్తి, కుళాయి పన్నులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బకాయిల వసూళ్లకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. గతంలో పలువురు రసీదులు లేకుండా పన్నులు చెల్లించడంతో కొందరు డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారనే విషయాలు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధంగా ఎవరైనా రసీదులు లేకుండా పన్నులు చెల్లించరాదని సూచించారు. ప్రజలు రసీదులు తీసుకుని పన్నులు చెల్లించాలని, లేదా నేరుగా ఆన్లైన్ మున్సిపల్ ఖాతాలో జమచేయవచ్చని స్పష్టం చేశారు. ఆస్తి, కుళాయి పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33054/