schedule Friday, September 11, 2026

యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..!

calendar_today February 16, 2025
person dharshininews
యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..!
యాలాల ఎంఈఓను సన్మానించిన వీరశైవ సమాజం..! - దర్మీది రమేష్‌ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల విద్యాధికారి దర్మీది రమేష్‌ను తాండూరు వీరశైవ సమాజం సభ్యులు సన్మానించారు. వీరశైవ సమాజం సభ్యులుగా ఉన్న రమేష్‌ యాలాల మండల విద్యాథికారిగా నియామకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సమాజం సభ్యులు దర్మీది రమేష్ నివాసానికి వెళ్లారు. శాలువా, పూలమాలతో సత్కరించి రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్మీది రమేష్‌ యాలాల మండల విద్యాధికారిగా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదువులు చేపట్టాలని, పదువులకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, సభ్యులు గాజుల శాంతుకుమార్, తంబాకు చంద్రశేఖర్, గౌరీ శంకర్, శెట్టి భాస్కర్, సంపత్, చంద్రశేఖర్, వాలి వినోద్, గంగా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33112/