schedule Friday, September 11, 2026

బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం

calendar_today February 17, 2025
person dharshininews
బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం
బీసీ సంఘం యువకుడికి అంతర్జాతీయ పురస్కారం - మలేషియాలో అందజేసిన టాటా ఇన్సురెన్స్ సంస్థ - సన్మానించిన బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన బీసీ సంఘం సోషల్ మీడియా కన్వినర్ బసవరాజుకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. మలేషియాలో టాటా ఇన్సురెన్స్ సంస్థ నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. గత 20 సంవత్సరాలుగా బీమా రంగంలో రాణిస్తూ ఇన్సురెన్స్ సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న మలేషియాలో టాటా ఏఐజీ ఇన్సురెన్స్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో బసవరాజుకు అంతర్జాతీయ పురస్కారం అందజేశారు. ఇందులో భాగంగా సోమవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బసవరాజును సన్మానించి అభినందించారు. రాబోయే రోజులలో బసవరాజు మరిన్ని పురస్కారాలను అందుకొ వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, యువ నాయకులు రాము ముదిరాజ్, పరమేష్, పండుగౌడ్, గిరిజాపూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33139/