schedule Monday, July 06, 2026

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..!

calendar_today February 21, 2025
person dharshininews
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..!
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూద్దాం రండి..! - ముస్తాబవుతున్న చెరువెంటి ఈశ్వరాలయం - ఎల్లుండి దేవాలయ వార్షికోత్సవం, శివరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం కన్నులారా చూసేంందుకు రావాలని తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు బసవేశ్వరనగర్‌లో వెలసిన చెరువెంటి ఈశ్వరాలయ దేవాలయ కమిటి సభ్యులు ఆహ్వనిస్తున్నారు. ఎల్లుండి 23వ తేదిన దేవాలయ వార్షికోత్సంతో పాటు మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు వాలి శాంతుకుమార్, కార్యదర్శి జొన్నల బస్వరాజ్, దేవాలయ అర్చకులు జగదీశ్వర్ స్వామి తెలిపారు. దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 23న ఉదయం 5-30గంటలకు స్వామి వారికి అభిషేకం, ఉదయం 10-30గంటలకు సుముహూర్తమున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవంకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయంలో స్వామిని అభిషేకం చేసే అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్లు, అభిషేకం చేయాలనుకునే వారు నేడు శుక్రవారం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 23వ తేది ఉదయం 9-30 గంటల వరకే అభిషేకానికి సమయం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా 26వ తేదిన మహా శివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఉదయం 4గంటల నుంచే 9 గంటల వరకు రుద్రాభిషేకాలు, ఆ తరువాత భక్తులకు దర్శనం, పంచామృతాభిషేకాలకు భాగ్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33311/