schedule Monday, July 06, 2026

విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..!

calendar_today February 21, 2025
person dharshininews
విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..!
విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..! - పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ - వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరికి విద్యతో ఉన్నత భవిష్యత్తుతో పాటు సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుందని తాండూరు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. తాండూరు వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాల తెలుగు మీడియంలో పదో తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని అన్నారు. పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలుగా గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శురాలు మంకాల స్వప్న, కోశాధికారిగా సింగంశెట్టి శోభతో పాటు కార్యవర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33314/