schedule Monday, July 06, 2026

తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక

calendar_today February 24, 2025
person dharshininews
తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక
తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక - అధికారికంగా ఖరారైన పర్యటన - పర్యటన వివరాలు ఇవే... తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంకు మహరాష్ట్ర నేల, నీటి సంరక్షణ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ విచ్చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం పర్యటన వివరాలను ప్రకటించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తాండాలోని భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు 26వ తేది మహా శివరాత్రి రోజున మంత్రి సంజయ్ రాథోడ్ హాజరు కానున్నారు. దేవాలయ వ్యవస్థాపకులు వాసుపవార్ నాయక్ సోదరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆల్ ఇండియా బంజార సంఘం అధ్యక్షులు శంకర్ నాయక్ ఆహ్వానం మేరకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ హాజరు కాబోతున్నట్లు వెల్లడించారు. మద్య ప్రదేశ్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణకు చేరుకుంటారని, హైదరాబాద్ బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలి క్యాప్టర్ ద్వారా తాండూరు మండలం అంతారం తాండాకు చేరుకుంటారని పర్యటన వివరాలను ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1గంటలకు చేరుకుని భూకైలాస్ బ్రహ్మోత్సవాల పూజలో పాల్గొంటారని, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారని ప్రకటించారు. మరోవైపు మంత్రి సంజయ్ రాథోడ్ రాక సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్, శంకర్ నాయక్ పవార్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/33424/