schedule Friday, September 11, 2026

స్టేషన్ హనుమాన్ పాలకవర్గ నియామకం

calendar_today February 25, 2025
person dharshininews
స్టేషన్ హనుమాన్ పాలకవర్గ నియామకం
స్టేషన్ హనుమాన్ పాలకవర్గ నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ - దేవాలయ చైర్మన్ గా శంకర్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్టేషన్ హనుమాన్ దేవాలయం పాలకవర్గం నియామకం అయ్యింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవాలయ బోర్డు ట్రస్టు సభ్యులుగా ఎం. శంకర్ రావు, ఎం. వెంకటేశం, ఎన్. నారాయణ, టీ. శ్రీధర్, జి.నరహరి, ఎం. ఇందులను నియమించినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. మొదట ట్రస్టు సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత చైర్మన్ గా శంకర్ రావును ఎన్నిక జరుగుతుందని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. దాదాపు ఆయన నియామకం పూర్తి అయినట్లే అని స్పష్టంగా చెబుతున్నారు. దీంతో దేవాలయ చైర్మన్ గా శంకర్ రావు ఎన్నిక కాబోతున్నారు. త్వరలోనే పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33446/