schedule Friday, September 11, 2026

శరవేగంగా దాసోహ మందిరం..!

calendar_today March 3, 2025
person dharshininews
శరవేగంగా దాసోహ మందిరం..!
శరవేగంగా దాసోహ మందిరం..! - రెండో అంతస్తుకు స్లాబ్ నిర్మాణం - ప్రారంభించిన భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో నిర్మిస్తున్న దాసోహ మందిరం(అన్నదాన సత్నం) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రెండో అంతస్తులో స్లాబ్ పనులు ప్రారంభించారు. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్‌ సభ్యులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్ కిరణ్‌ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, దాతల సహాకారంతో దాసోహ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో పాటు పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ఉన్న బసవేశ్వరుని భవనంకు స్లాబ్ వేయడం జరిగిందన్నారు. దాసోహ నిర్మాణంకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదళి రవికుమార్, సభ్యులు సడ్గి భద్రణ్ణ, సంపత్, గంగా శ్రావణ్, బీదర్ రాజశేఖర్, వాలి శ్రావణ్, తంబాకు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33641/